1. కట్నం ఒక భారం నవమాసాలు మోసి కన్న ఆడపిల్ల పుట్టగానే గుండెల మీద కుంపటా? సనాతన కాలం నుండీ నేటి వరకూ ఆమె సంతలో అమ్ముడయ్యే అభాగినా? ఆమె పెరుగుదలను చూసి గర్వించక తలిదండ్రులు పైస పైస కూడబెట్టి కాసులకై వేచి చూసే పెళ్ళికొడుకుకి కష్టాలకెదురొడ్డి కానుకగా ఇచ్చేరు లాయరుకో కట్నం, డాక్టరుకింకో ధర కార్మికుడు, కర్షకుడు, ఉపాధ్యాయుడు పదవేదైనా వాడి గొంతెమ్మ కోరికలకు ఏదీ ఆనకట్ట, ఏదీ పరిష్కారమార్గము? నగలూ, వస్తువులూ, ఖరీదైన ఆస్తులు అప్పణంగా అందుకొనే ఆ మగమహారాజులు ఇస్తే పుచ్చుకోవడమే, వస్తే ఆశించడమే కొందరు బల్వంతంగా, మరికొందరు మన్ననగా! వరకట్న పిశాచీలు మానవత్వం లేని అసురులు చావుదెబ్బలతో బాటు చంపాలని యోచించే మనుష్యులు సమాజ నియమాలకీ, కర్కశులైన కుటుంబానికి అనుదినం బలి అయ్యేది ప్రతీ కోమలాంగి! అంతరం లేని కులాలు, మతాలు, జాతుల మధ్య ఆలోచనా తీరు మారాలి, నవసమాజ నిర్మాణం జరగాలి సమానత్వం కోరే అతివకు పెళ్ళనే ముసుగులో గుద్దులాట తగదిలా! పరిణయం మారాలి ఓ కవచంలా!